ముంబై కు  చెందిన రోమిత ఘోష్ అడ్మైరస్‌, ఐహీల్‌ అనే హెల్త్‌ టెక్‌ సంస్థలను స్థాపించింది. ఇవి కొత్త టెక్నాలజీలను తక్కువ ఖర్చుతో దేశీ మార్కెట్‌కు అందిస్తుంటాయి.కోవిడ్ సమయంలో వైద్య సిబ్బంది రోగులు వాడే పి.పి.ఇ కిట్ లు పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి కావటం అవి ఎంతో ధర తో ఉండటం గమనించింది రోమితా ఘోష్‌. పైగా వాటిని ఒక్కసారే వాడి పారేయ వలసి ఉండటం చూసి యువీ కిరణాలతో పి పి కిట్ లు శుభ్రం చేసే రోర్  స్టెరిలైజర్ ను కనుక్కుంది. బయో వేస్ట్ తగ్గేలా చేసిందీ పరికరం ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి శ్రీ శక్తి ఛాలెంజ్ పోటీల్లో బహుమతి గెలుచుకుంది మిత ఘోష్.

Leave a comment