ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను పిల్లల విషయంలో ఏ కారణం గాను మిస్ చేయొద్దు అంటున్నారు డాక్టర్లు. ఈ బ్రేక్ ఫాస్ట్ తీసుకోక పొతే పిల్లలకు పోషక విలువలు అందవు అంటున్నారు ఉదయం ఏడు గంటల నుంచి, 9 గంటల లోపు బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. ఈ ఉపాహారం తినని పిల్లల్లో ఐరన్ పోషకాలు సిఫార్స్ చేసినా దాని కంటే తక్కువగా ఉంటాయంతున్నారు. 21.5  శాతం మందిలో అయోడిన్ శాతం అతి తక్కువగా ఉందంటున్నారు. చిన్నతనం నుంచి  ఆహారపుఅవాట్లను తల్లిదండ్రులు నియంత్రించడం కుడా పరిస్దితికి కారణం అంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం ప్రతి రోజు బ్రేక్ ఫాస్ట్ చేసే పిల్లలు మంచి వేతనాలు వున్న కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల్ని ఆర్ధికంగా వెనుకగా వున్న కుటుంబాల పిల్లలకు ఈ ఉదయపు ఆహారం అందకపోవడం వల్ల వాళ్లలోనే అనారోగ్యాలు కనిపిస్తున్నాయని స్పష్టంగా తెలుస్తుంది.

Leave a comment