Categories
కాలుష్యం మనుష్యులని ముంచేస్తుంది . ఎన్నెన్నో అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి . ఈ కాలుష్య నియంత్రణ కోసం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి . అందులో ఒకటి గ్రీన్ బస్ ఈ బస్ రోడ్డు పైన నడుస్తూ ఉంటే కలుషితమైన గాలి పరిశుభ్రం అవుతుంది . బస్ కి ఏర్పాటు చేసిన ఫిల్టర్లు గాలిలోని అత్యంత సూక్ష్మమైన కణాలను కూడా గాలి నుంచి తొలగిస్తాయట . యునైటెడ్ కింగ్ డామ్ కు చెందిన గో ఎహెడ్ గ్రూప్ ఈ బస్ తయారుచేసారు . ఇది ప్రయాణం చేసే పది మీటర్ల వ్యాసార్థం లో తన ప్రభావం చూపిస్తుంది . ప్రతి ఫిల్టర్ 99.5 శాతం సామర్థ్యంలో గాలిని శుభ్రం చేస్తుంది . వీటిని బస్ పైన అమర్చారు గనుక ఇందులో ప్రయాణం చేసే వాళ్ళకు ఎలాటి ఇబ్బంది ఉండదు .