Categories
ఎక్కువ గంటలు నీళ్ళలో నానటం ,రసాయనాలు వాడి ఇల్లు క్లీన్ చేయటం ,బట్టలు ఉతకటం వంటి పనులు క్యూటికల్స్ చర్మం రేగినట్లు అయిపోతుంది. ఇంట్లోనే కాస్త జాగ్రత్త తీసుకొంటే ఈ సమస్య పోతుంది. లేక పోతే గోళ్ళ కుదుళ్ళ వద్ద చర్మం రేగడమే కాకుండా తర్వాత చీలి రక్తం కూడా వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి రోజు రాత్రి ఓ చుక్క కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ ను గోటి కుదురు పై వేసి ఆరెంజ్ స్టిక్ తో క్యూటికల్ ను వెనక్కి నెమ్మదిగా నెట్టాలి. గ్లవ్స్ వేసుకొంటే నూనె మరకలు దుస్తులకు అంటకుండా ఉంటుంది. నూనెల బదులు క్యూటికల్ జెల్ కూడా వాడవచ్చు. గోరువెచ్చని నూనెలో వెళ్ళు ముంచి రోజుకోసారైనా మసాజ్ చేస్తే వేళ్ళు గోళ్ళు ,కుదుళ్లు పగిలి పోకుండా బావుంటాయి.