Categories
జీడిపప్పు ,ఆక్రూట్ ,బాదం పిస్తా వంటి పప్పులన్ని ఆరోగ్యాన్నిచ్చేవే . ఇవి చెడు కొలెస్టరాల్ ని అదుపులో ఉంచుతాయి ట్రైగ్లిజరైట్స్ ను తగ్గిస్తాయి రక్తనాళాల ఆరోగ్యం కాపాడి వాపును తగ్గిస్తాయి. బాదం ,జీడిపప్పుల్లో రెండింటిలో కేలరీలు ఒకలాగే ఉంటాయి కానీ జీడిపప్పులో పాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు కార్బోహైడ్రేడ్స్ చాలా ఎక్కువ . బాదంలో ప్రోటీన్లు పీచు ఎక్కువ . బాదంలో కాల్షియం ఉంటె జీడిపప్పులో ఐరన్ ఉంటుంది . ఈరెండింటినీ సమంగా తింటే ఎక్కువ పోషకాలు లభిస్తాయి . డయాబెటీస్ ఉన్నవాళ్ళు బాదం వల్ల ఎక్కువ ప్రయోజనం రోజుకు అన్ని కలిపి ,ఓ గుప్పెడుగా తినగలిగితే ఎంతో ఆరోగ్యం .