Categories
వ్యాయామం అంటే వాకింగ్ రన్నింగ్ మాత్రమే కాదు. యాభై దాటాక కుడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే జింకు వెళ్ళవలసిందే అంటున్నారు పరిశోధకులు. రెండు లక్షల మంది పై ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులుఅద్యాయినం చేసాక, నడకకే పరిమితమైన వాళ్ళకంటే జిమ్ లో చమటలు పట్టేంత వరకు వ్యాయామం చేసిన వాళ్ళు ఎక్కువ ఆరోగ్యంగా వున్నట్లు తేలిందిట. నడకకే పరిమితమైన వాళ్ళలో కీళ్ళకు సంబందించిన ఆరోగ్య సమస్యలు కనిపించాయి. అదే జిమ్ లో కష్టపడిన వారు అన్ని అవయవాలు యాక్టివగా సంపూర్ణమైన ఆరోగ్యంతో వున్నట్లు కనిపెట్టారు. కేవలం నడకతోనే సారి పెట్టుకోవద్దు జిమ్ సంగతి ఆలోచించండి అంటున్నాయి అద్యాయినాలు.