సంతోషానికి ,దుఃఖానికి కూడా కన్నీళ్ళు వస్తాయి . బాధగా ఉన్నపుడు కన్నీళ్ళు పెట్టుకొంటే ,మనసు భారం తీరిపోతుంది . దుఃఖాన్ని ఆపుకొంటే మాత్రం వత్తిడి భయం అయితే కన్నీళ్ళు కళ్ళకు మేలు చేస్తాయంటున్నారు ఎక్స్ పర్డ్స్ . కన్నీళ్ళతో కళ్ళు ఉంటే మలినాలు బయటకి వెళ్ళిపోతాయి . కళ్ళలోని నీరు యాంటీ బాక్టరియల్ గా ,యాంటీవైరల్ గా పనిచేసి కంటి సమస్యలు తగ్గిస్తాయి . ఏడుపు అనేది ఒక స్వీయ ఉపశమనం కూడా . సాధారణ కన్నీళ్ళు కళ్ళలోని దుమ్ముని తొలగిస్తే ఎమోషనల్ గా ఫీలయితే వచ్చే కన్నీళ్ళు వత్తిడి తగ్గించి శరీరానికి విశ్రాంతిని ,మనసుకి శాంతిని ఇస్తాయి . కన్నీళ్ళకు ఉండే శక్తి శారీరక ,మానసిక భాదను కూడా తగ్గించగలదట . అందుకే ఎప్పుడైనా దుఃఖం వస్తే శుభ్రంగా ఏడ్చేయండి పర్లేదు అంటున్నాయి అధ్యయనాలు .

Leave a comment