Categories
Soyagam

హెయిర్ లాస్ కు గృహ వైద్యం.

ఉదయం లేచాక దిండు నిండగా వెంట్రుకలు రాలిపడి కనిపిస్తే జుట్టు రాలిపోయినట్లే లెక్క. జుట్టు బాగా పల్చబడి పోవడం ఎడం అవుతున్నా అవసరానికి మించి వూడుతున్నట్లే. కొన్ని రకాల హెయిర్ లాస్ కి గృహ సంబంధమైన చికిత్సలు చాలా బాగా పనిచేస్తాయి. శిరోజాల టిష్యులకు పోషకాలందించే గోప్పగునాలు కొబ్బరి పాలల్లో వున్నాయి. తాజాకొబ్బరి తుర్మి బ్లెండ్ చేసి పాలు తీసి దాన్ని మాడుకు శిరోజాలకు పట్టించి 15,20 నిమిషాలు ఆగి తలస్నామం చేస్తే సరిపోతుంది. కొబ్బరి పాలతో మాడుకు మసాజ్ చేయాలి. అలాగే అత్యధిక ఔషధ గుణాలు కలిగిన వేపాకు కుడా జుట్టుకు రాలడం అరికడుతుంది. అలాగే తేనె, ఆలివ్ ఆయిల్ కలిపి అందులో ఒక స్పూన్ దాల్చిన చక్క పొడి పేస్టులాగా చేసుకుని, దాన్ని జుట్టుకు పట్టించి అరనిచ్చి, కడిగేస్తే జుట్టు రాలడం ఆగి పోయి కొత్త వెంట్రుకలు తర్వాత వచ్చేందుకు దోహదం చేస్తుంది. వీటితో ఫలితం వుందక్ పొతే డాక్టర్ ను కలుసుకోవడం ఉత్తమం.

Leave a comment