Categories
ప్రతిరోజు ఏడు నుంచి పది కరివేపాకులు తింటే జుట్టు నెరవడం, రాలటం తగ్గిపోతాయి అంటారు ఆయుర్వేద నిపుణులు.కరివేపాకు నేరుగా తిని కొన్ని నీళ్లు తాగాలి.లేదా కప్పు నీళ్లలో కరివేపాకు మరిగించి వడకట్టి ఆ నీళ్లు తాగాలి. అలాగే తాజా కరివేపాకు శుభ్రంగా కడిగి ఎండబెట్టి దాన్ని స్పూన్ నెయ్యితో వేయించాలి.చల్లారాక నమిలి తినాలి.కరివేపాకు చట్నీ,అన్నం లేదా బ్రేక్ ఫాస్ట్ లో తింటే చక్కెర అదుపులో ఉంటుంది.కరివేపాకు పొడి తేనెలో కలిపి తింటే నోటిలో పుండ్లు పోతాయి.ఇది నోటి దుర్వాసన తగ్గిస్తుంది.