Categories
ఇప్పుడు హ్యాండ్ పెయింటెడ్ బ్యాంగిల్స్ ఫ్యాషన్ మొదలైంది .గాజుల పైన అందమైన చిత్రాలు వేసిన ఈ గాజులు చుడగానే కళ్ళని ఆకట్టుకుంటున్నాయి. చేత్తో వేసే ఈ పెయింటింగ్స్ ఉన్న గాజులు ఎక్కువగా తయారయ్యేవి రాజస్థాన్ లోనే .ఈ హ్యాండ్ పెయింటెడ్ గాజుల్లో కొన్ని ఆఫీసులకు కాలేజీలకు ధరించేవి,మరికొన్ని పెళ్లిళ్లు శుభకార్యాలకు వేసుకునేవి ఉన్నాయి .సెట్ లో అయితే పెయింటింగ్ వేసిన గాజులు రెండు మధ్యలో ఉండి అటు ఇటు రాళ్లు పొదిగిన గాజులు ఉన్నాయి.దేవి దేవతల రూపాలున్న గాజులు వధూవరులు వర మాలలు వేసుకుంటున్నవీ,పాణిగ్రహణం కొంగుముడి వంటి చిత్రాలతో ఈ గాజులు ఇవ్వాల్టి ఫ్యాషన్ ట్రెండ్.