భూపాల్ కు చెందిన సాక్షి భరధ్వాజ్ ఇంటి పైన వేలాడే తోటను ఏర్పాటు చేసింది మైక్రో బయాలజీ పూర్తి చేసి మన్ సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసే సాక్షి కొబ్బరి బోండాలను కడిగి ఎండబెట్టి వాటికి చక్కని రంగులు వేసి వాటికి రెండు రంద్రాలు చేసి ఇనుప తీగలతో హుక్స్ లా డాబాపై వేలాడ దీసింది. ఆకులతో వర్మీ కంపోస్ట్ తయారు చేసి అందులో మొక్కలు నాటింది. ఈ ఇంటి తోటలో నాలుగు వందల యాభై మొక్కలున్నాయి దేశీయ విదేశీ మొక్కలన్నీ కలిపి మొత్తం నాలుగు వేల మొక్కలున్నాయి.