Categories
సమాజంలో పేరున్న మహిళలపై తప్పుడు సమాచారంతో కూడిన దాడులు సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతున్నాయని ఎంటిటీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ తన నివేదికలో చెబుతోంది ఈ దుష్ట్రచారలకి జెండర్ ప్రధాన కారణంగా ఉందని ఆ ఐక్య రాజా సమితి స్పష్టం చేసింది.ఆన్ లైన్ లో వేధింపులకు గురవుతున్న మహిళలు 67 శాతం మంది ఉన్నట్లు బవ్ సర్వే చెబుతోంది. జి.ఎస్. ఎం అసోసియేషన్స్ మొబైల్ జెండర్ గ్యాప్ 2019 నివేదిక ప్రకారం భారతదేశం లో మొబైల్ ఇంటర్నెట్ వాడుతున్న మహిళలకు 50 శాతం కన్నా తక్కువ. మహిళలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను ప్రకటిస్తే వారిపై ఆన్ లైన్ హింస అధికంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.