నీహారికా ,

ఇందాక మా ఫ్రెండ్ మాట్లాడిన ఫ్రిజ్ లకు స్టిక్కర్ల వ్యవహారం నీకు నవ్వొచ్చింది కానీ చాలా మంది కుటుంబాలు ఇలాగె ఉంటున్నాయి, మా ఇంట్లో ఉన్న నలుగురం తలోదారిన ఉదయాన్నే ఉద్యోగాలు కాలేజీలు అంటూ బయటకి పోతాం. ఏవైనా చెప్పుకోవాలిసి వస్తే ఓ స్లిప్  రాసి  ఫ్రిజ్ కి అంటించుకుంటాం. ఆ స్లిప్  లీ మామధ్య కమ్యూనికేషన్ అందామె. చాలా స్కూళ్లల్లో ఇంతే . కలిసి కూర్చుని భోజనం చేయటం మాట్లాడుకోవటాలు చర్చలు అన్నీ బంద్. హడావుడిగా మొక్కుబడిగా పరుగులతో జీవితం .. ఎవరి చేతిలో వాళ్ళ ఫోన్లు లాప్ టాప్ లు. అసలు ఒకళ్ళ నొకళ్ళు అర్ధం చేసుకునే అవకాశం కూడా లేని బిజీ ఉద్యోగాల భార్య భర్తలు వాళ్ళ పిల్లల డే కేర్ సెంటర్లలో ఏం  జరుగుతోంది. మానవ సంబంధాలు నశించి పోతున్నాయి. అసలు మాటలే కరువైతే సంబంధాలెక్కడ? కానీ ఒకటి మాత్రం బలంగా చెప్పాలని వుంది. పగలంతా ఎవళ్ళ జీవితం వాళ్ళదిగా గడిపినా కనీసం రాత్రివేళ కలిసి భోజనం చేయండి. ఆ కాస్త సమయం మీకోసం మిగుల్చుకోండి. ఇంటి గురించి పిల్లల గురించి ఫ్యూచర్ గురించి మాట్లాడుకోండి. మనుషుల మధ్య మాటల వంతెనలు లేకపోతే మాటలే తెగిపోతే ఆప్యాయతలు ఎలా వస్తాయి. అప్పుడు సౌకర్యాలు సంపదలే ఉంటాయి. కానీ ప్రేమించే మనుషులే వుండరు. ఆ స్థితి తెచ్చుకోవద్దు అని . ఏమంటావ్ !

 

Leave a comment