Categories
సరుకుల కోసం ఏవీ మర్చిపోకుండా తెచ్చుకునేందుకు ఉపయోగపడుతుంది గూగుల్ కీప్ ఈ యాప్ ని మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు ఫస్ట్ ఐకాన్ క్లిక్ చేసి కొత్త నోట్ తెరవాలి అందులో దిగువ ఎడమవైపు ఉండే ప్లస్ గుర్తు క్లిక్ చేస్తే టిక్ బాక్స్ లు వస్తాయి. అవి ఎంచుకొంటే టిక్ లు పెట్ట గలిగేలా ఓ జాబితా వస్తుంది. అందులో కొనాలనుకున్న వస్తువుల జాబితా రాసుకోవచ్చు. ఇలా సిద్ధమైన జాబితా నోట్ కుడివైపున ఉన్న మూడు చుక్కల ఐకాన్ క్లిక్ చేస్తే కొలాబరేటర్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేసి జాబితా ఇంట్లో వాళ్లకు కూడా పంపి చెక్ చేసుకోవచ్చు దీనివల్ల కొనాలనుకున్న వస్తువులు మరచిపోకుండా కొనవచ్చు.