నక్షి హీలింగ్ ఇన్ స్ట్రక్టర్ గా తన చుట్టూ ఉన్న వారి మానసిక శ్రేయస్సు కోసం పనిచేస్తారు. హీలింగ్ థెరపీ ఆందోళనను తగ్గించే ఒక ప్రక్రియ. ఇన్షీ వెల్ నెస్ పేరుతో 2021 లో ఒక సంస్థ స్థాపించారు. ముంబై లో ఉంటున్న నక్షి రకరకాల హీలింగ్ ప్రక్రియలను అధ్యయనం చేశారు. పరిష్కారం కాని సమస్యలను ధ్యానం, యోగా వంటి పద్ధతుల ద్వారా పరిష్కారం వెతకొచ్చు. ఒకరి మనసులో వేదనను తొలగించవచ్చు. మానసిక వేదనకు సరైన మందు మనలోకి మనం ప్రయాణించటం అంటారు నక్షి.

Leave a comment