కరోనా జబ్బు గాలి ద్వారా వ్యాపిస్తుందని గాలిలో తేలియాడే సూక్ష్మ తుంపర్ల తో సార్స్ సివోవి 2 అనే వైరస్ పారుతోందని శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. గాలిలో వచ్చే కరోనా ను తరిమి వేయాలంటే మాస్క్ చేతులు కడుక్కోవటం సరిపోదు. ఇళ్లలోని ధారాళంగా గాలి వచ్చి పోయే లా చూసుకోవాలి. తలుపులు కిటికీలు తెరిచి ఉంచాలి వీలైతే లోపల గాలి బయటకు పంపే ఎగ్జాస్ట్ ఫ్యాన్ లు వాడుకోవాలి దానితో తుంపరల తో కూడిన గాలి బయటకు పోతుంది. గాలి వెలుతురు బాగా వచ్చే చోట వైరస్ క్రిములు ఎంత సేపు నిలిచి ఉండలేవు త్వరగా నిర్వీర్యమై పోతాయి లిఫ్ట్ లో కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ లు ఏర్పాటు చేసుకోవాలి. అంతగా గాలి ఆడని ఇళ్ళు భవనాల్లోనే ప్రమాదం పొంచి ఉంటుందన్నది కొత్త విషయం.పగలంతా గాలి వెలుతురు వచ్చేలా ఇల్లు ఆఫీస్ ల తలుపులు తెరిచే ఉంచామని చెబుతున్నారు శాస్త్రజ్ఞులు.
Categories