పగలు నిద్ర పోతే రాత్రికి నిద్ర రాదని పైగా అలవాటే మంచిది కాదని అనుకునే వాళ్ళు చాలా మంది. కానీ పగటి నిద్ర మంచిది అంటున్నారు పరిశోధికులు. ప్రతి రోజు  ఓ అరగంట నిద్ర పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు. రాత్రి నిద్రలో  ఆటంకాల వల్ల కలిగే ఆరోగ్య లోపాల్ని ఈ పగటి నిద్ర సరిచేస్తుంది. పగటి నిద్ర పోయేవాళ్ళ మెదడులో ఒత్తిడిని తగ్గించగల నార్ ఎపి నెఫ్రెన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది . ఇది గుండె సంబంధ రుగ్మతును రక్త పోటును తగ్గించే ప్రభావం కలిగివుంటుందని కనుక డయాబెటిస్,స్థూలకాయం రక్తపోటు డిప్రెషన్ తో బాధపడే వారికీ పగటి నిద్ర ఆరోగ్యాన్ని మెరుగు పరచటంలో ఉపకరిస్తుందని చెపుతున్నారు.

Leave a comment