Categories
మన దేశ ట్రిపుల్ ఐటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ప్రతి రోజూ అరగంట సేపు ధ్యానంలో గడిపే వారిలో మెదడు చాలా ఆరోగ్యంగా చురుకుగా పని చేస్తోందని చెబుతున్నారు. ఈ రోజుల్లో నాడీ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. ఆల్జీమర్స్ చాలామందిలో కనిపిస్తోంది. డెమన్షియా, జ్ఞాపకశక్తి, మందగింపు కూడా ఎక్కువవుతోంది. ఇటువంటి సమస్యకు వయసులో చేసే ధ్యానమే విరుగుడు అంటున్నారు. జ్ఞాపక శక్తికి సంబంధించిన మెదడు భాగాలు ధ్యానం చేసే సమయంలో చూపించే స్పందనలు, ఆ తర్వాత కాలంలో అది మెరుగ్గా పనిచేయడం గమనించాక ఈ నిర్ణయానికి వచ్చారు.