శ్రద్ధా దంగర్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమా ఆవార్డ్ వచ్చింది. స్త్రీలను పూర్తిగా నాలుగు గోడల మధ్య బంధించి వారి ఆలోచనలు నడవడికను, చివరకు వారి కలలను కూడా నియంత్రించే పితృస్వామ్య భావజాలాన్ని ఊరులోని స్త్రీలంతా ఏకమై ఎదుర్కొన్న విధానం సినిమాలో చక్కగా చూపించారు.కచ్ ప్రాంతంలో ఒక చిన్న ఊరు అందమైన ఎంబ్రాయిడరీ చేయటం స్త్రీల కు చాలా బాగా వచ్చు. కానీ ఆ ఊరిలో స్త్రీలు ఎన్నో ఆంక్షల మధ్య జీవిస్తుంటారు ఆ ఊరికి మంజరి అనే అమ్మాయి కొత్తగా పెళ్లి చేసుకోని వస్తుంది. ఆమె సహాయంతో ఊరిలో స్త్రీలు అణచివేతల నుంచి బయటకు వచ్చేందుకు చేసే ప్రయత్నం ఈ సినిమా. ఈ సినిమా హాట్ స్టార్ లో ఉంది.