Categories
31 సంవత్సరాల లూసియానా రెబెల్లో గర్భాశయ కాన్సర్ తో బాధ పడుతోంది.ఇందుకు గానూ కీమో థెరపీ తీసుకొంటుంది. ఆ సందర్బంగా తల నున్నగా షేవ్ చేయాల్సి ఉంది. లుథియానా తల్లి కూతురికి షేవ్ చేస్తూ తన తలను కూడా షేవ్ చేసుకోవటం మొదలు పెట్టింది. తల్లి భావోద్వేగ నిర్ణయంతో కూతురు షాక్ తో కనీళ్ళతో చూస్తూ ఉండి పోయింది. కనీళ్ళతో ఉన్న కూతురితో నువు ఒంటరి దానివి కాదు నేను నీకు తోడుగా ఉన్నాను. మన మనిద్దరం దైర్యవంతులం ఈ పోరాటంలో మనిద్దరం నెగ్గుతాం అంటూ కూతురికి ధైర్యం చెపుతున్న ఈ వీడియో వైరల్ అయింది. బ్రెజిల్ కు చెందిన లుథియానా తన ఫేస్ బుక్ వాల్ పై ఈ వీడియోను పంచుకొంది.