Categories
తాజా అధ్యయనాల ప్రకారం దక్షణ భారతదేశం లోని పట్టణాల్లో 21.4 శాతం అబ్బాయిలు . 18.5 శాతం అమ్మాయిలు స్థూలకాయులే . పోషకాహార లోపం కన్నా . స్థూలకాయం తో వచ్చే అనారోగ్యాలే ఎక్కువ . దిగులు పడి మానేయకుండా నెమ్మదిగా బరువు తగ్గించుకోమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . శరీరానికి అవసరమైన విటమిన్లు ,పోషకాలు అందక బలహీనమై పోకుండా నెమ్మదిగా పేరుకున్న కొవ్వు కరిగించుకోవాలి . ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి . రోజుకు అరగంట వేగంగా నడవాలి . చురుకైన జీవనశైలి అలవర్చుకొంటే బరువు తగ్గటం దానంతట అదే జరుగుతుంది . పిల్లలకు కనీసం రోజుకు గంట శారీరక వ్యాయామం . ఉండేలా చూడాలి అంటోంది జాతీయ పోషకాహార సంస్థ .