డోపమై ఫాస్టింగ్ పేరుతో పుస్తకం రాశారు అమెరికన్ సైకియాట్రిస్ట్ అన్నా లెంబ్కే. ఆమె చెబుతున్న ప్రకారం మన చుట్టూ ప్రపంచంలో ఉండే ఎన్నో ఎక్కువ సౌకర్యాలు ఒత్తిడి పెంచుతాయి.వీటి తో మెదడులో డోపమైన్ పెరుగుతుంది. అందుకే జీవితంలో ఒక బ్రేక్ తీసుకోవాలి. అధిక నిద్ర తిండి అదేవిధంగా అదేపనిగా సోషల్ మీడియాలో తలదూర్చే ఎన్నో అలవాట్లు తగ్గించమని డిజిటల్ ప్రపంచం నుంచి కొద్ది రోజులు దూరంగా ఉంటే ఆరోగ్యం అంటున్నారు. ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటం కాదు సెల్ ఫోన్ కు సెలవు ఇచ్చి ప్రశాంతంగా ఉండమంటున్నారు అన్నా లెంబ్కే.

Leave a comment