బరకగా అనిపించే కూరలు మెత్తగా పట్టుల మెరిసేలా అవ్వాలంటే కెరటిన్ చికిత్స తీసుకో మంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇది సహజ సిద్ధమైన లేపనం చికిత్స. దీన్ని ఇంట్లోనే తయారు చేసి వాడుకోవచ్చు. బియ్యం, మొక్కజొన్న పిండి, కొబ్బరి,ఆలివ్ నూనె నీళ్లు తీసుకోవాలి. ముందుగా నాలుగు స్పూన్ల బియ్యం పాన్ లో వేసి నాలుగు గ్లాసుల నీళ్లలో జావలా ఉడికించాలి. చిన్న గిన్నెలో స్పూన్ మొక్కజొన్న పిండి వేసి అరకప్పు నీళ్లు పోసి ఉండల్లే లేకుండా కలిపి బియ్యం జావ లో పోసి మళ్ళీ ఉడికించాలి. దీన్ని చల్లార్చి ఇందులో కొబ్బరి ఆలివ్ నూనె పోసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని కురుల చివర్ల వరకు పట్టించాలి. అరగంట ఆగాక గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్తే చాలు మృదువైన జుట్టు సొంతం చేసుకోవచ్చు. బియ్యంలోని అమైనో యాసిడ్స్ బి,ఇ విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు దృఢంగా ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.
Categories