Categories
ఒక స్పూన్ తేనెతో పగిలిన పెదవులు, కళ్ళ చుట్టూ వలయాలు, యాక్నే వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు యాక్నే పై తేనె రాసి బాండ్ ఎయిడ్ ని అతికిస్తే తెల్లారేసరికి తగ్గుముఖం పడుతుంది. తేనె నెయ్యి కలిపి పెదవులకు రాస్తే పగుళ్లు పోయి పెదవులు మృదువుగా ఉంటాయి. ఆలీవ్ నూనె, తేనె కలిపి కళ్ళకింద వలయాలకు రాస్తే రెండు రోజుల్లో మార్పు చూడవచ్చు. బ్లాక్ హెడ్స్ కు తేనె, దాల్చిన చెక్క పొడి రాస్తే ప్రయోజనం ఉంటుంది.