ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం, స్వీట్లు ఫాస్ట్ ఫుడ్ రుచిగా ఉంటాయి కానీ ఆరోగ్యకరమైన పోషకాహారం ఫాస్ట్ ఫుడ్స్ తో పోలిస్తే అంత రుచిగా ఉండకపోవచ్చు. ఉప్పు కారం తగుపాళ్ళలో వాడి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి తక్కువ నూనెతో పదార్థాలు రుచిగా ఉండేలా ఇంట్లోనే ఆహారపదార్థాలు చేయటం నేర్చుకోవాలి. కేవలం రుచి కోసమే ఆహారం తింటే దీర్ఘకాలంలో అనారోగ్యాలను మనమే ఆహ్వానిస్తున్నట్లు అవుతుంది. మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంగా ఉండాలనే నియమం మాత్రమే ఎప్పుడు లభిస్తుంది. ఇంట్లోనే ఆరోగ్యాన్నిచ్చే వంటలు చేసేందుకు ప్రయత్నించడం మంచిది.

Leave a comment