Categories
ప్రపంచం మొత్తం ఒక్కసారి ఆగి చదవేంత విలువైన రిపోర్టు వచ్చింది. జుట్టు ఊడిపోవటం ,పలుచబడటం వంటి సమస్యకు స్త్రీ పురుష భేదం లేదు. ఎన్నో అధునాతన చికిత్సలున్న ,ఇంత వరకు సరైన పరిష్కారం లేదు. జపాన్ పరిశోధకుల బృందం చేసిన పరిశోధనలో ఒక కొత్త విషయం బయటపడింది. తేనే టీగెల గూడులోని ఒక ప్రోపిలిస్ అనే జిగురు వంటి పదార్ధం జుట్టు పెరిగేలా చేయగలదని కొన్ని ప్రయోగాల ద్వారా కనుగొన్నారు. గూడు తయారీలో చోటు చేసుకున్న చిన్న చిన్న రంధ్రాలను పూడ్చేందుకు తేనే టీగలు మొక్కల నుంచి సేకరించిన జిగురును వాడుతాయి. ఇది బ్యాక్టీరియా, ఫంగస్ లను దగ్గరకు రానివ్వదు. పూర్వీకులు కంతులూ ,గాయాలు ,పుండ్లు నివారణలో ఈ జిగురు వాడేవారట. ఆవిషయం గమనించి చేసిన పరిశోధనలో జుట్టు ఒత్తుగా పెంచగలదని తేలింది.