మీరన్నట్లే క్రికెట్ అనేది పవర్ గేమ్ పేస్ గేమ్ కామెంటేటర్ గా మారి గేమ్ ను వదిలి పెట్టేందుకు తగిన సమయం ఇదే నని మొహమాటం లేకుండా అనేశారు లీసా స్థలేకర్.   ఇంగ్లాండ్ జట్టు మాజీ ఓపెనర్ క్రికెట్  కామెంటేటర్ జెఫ్రీ బాయ్ కాట్  ఇప్పడిక బి. బి. సి రేడియో టీమ్ లో లేరు అలా బయటకు వచ్చిన  ఈ  79 ఏళ్ల బాయ్ కాట్ టెలిగ్రాఫ్  ప్రత్యేక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మహిళ కామెంటేటర్స్ మగవాళ్ళ మ్యాచ్ లకు పనికి రారు అనేశారు.ఈ కామెంట్ కు మండి పడ్డారు ఆస్ట్రేలియన్ క్రికెట్ కామెంటేటర్ లీసా స్థలేకర్ ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్ ఉమెన్ వెంటనే రిటార్డ్ ఇచ్చారు మహిళలు సమర్థ వంతంగా దేన్నయినా  హ్యాండిల్ చేయగలరు అనేందుకు ఈ ఉదాహరణ చాలదా ?

Leave a comment