జుట్టు రాలిపోవడం ఇప్పుడు వందలో 99 మంది సమస్య. దువ్వుతుంటేనే రాలిపోతుంటాయి. వాతావరణం కాలుష్యం మొదటి కారణం అయితే మానసిక ఒత్తిడి రెండో కారణం. ఒక్కసారి అతి శ్రద్ధ తీసుకోవటం కూడా కారణం కావచ్చు. వాడే మంచి అనుకునే షాంపూలు నూనెలు ఆధునిక వైద్యలు ఇవన్నీ… ఇప్పుడు తలంటుకుంటే షాంపూలు గట్టిగా రుద్దేయటం కూడా కేశ సంపదకు నష్టం కలిగించేదే. ఎక్కువగా బ్రషింగ్ చేసినా నష్టమే. షాంపూ చేసుకున్నాక అతడి జుట్టును గబగబా టవల్ తో అద్దేయద్దు. హెయిర్ డ్రయర్ల వాడకం కూడా ప్రమాదం. హెయిర్ ప్రాడక్ట్స్ లో వుండే రసాయనాల జుట్టు పై ప్రభావం చూపెడతాయి. రకరకాల హెయిర్ స్టైల్స్ కోసం జుట్టును హీట్ చేయటం కూడా జుట్టు రాలేందుకు కారణం కావచ్చు. అతి ప్రాచీన పద్ధతి జుట్టు ను వారానికోసారి వేడి చేసిన కొబ్బరి నూనెను కుదుళ్లను తాకేలా మర్దన చేసి కుంకుడు కాయలు వాడి స్నానం చేయటం బెస్ట్ పద్ధతి.
Categories