వయసొచ్చిన అమ్మాయిలతో అమ్మలకు చాలా కష్టం. హడావుడిగా తిరిగేస్తూ ఏమీ తినమంటారు. అందమంటే సన్నగా ఉండటం అనుకుని స్ట్రిక్ట్ గా వుంటున్నామనుకుని చిరు తిళ్ళ పై పడిపోతారు. అసలు ఇలా చేస్టన్ సరైన పోషకాహారం అందక బరువు పెరుగుతారు . హార్మోన్ల మార్పులతో నెలసరి క్రమం తప్పటం జుట్టు ఊడిపోవటం చాలా చిరాకులోస్తాయి. డాక్టర్లు గట్టిగ పోషకాహారాలు రికమెండ్ చేస్తున్నారు. ఆకు కూరలు తృణ ధాన్యాలు పాల పదార్ధాలు అన్నీ అందాలంటున్నారు. వెన్న లేని పాలు ఇష్టం లేకపోతే పెరుగు తినాలంటున్నారు. నట్స్ నువ్వులు తప్పనిసరి . ముదురురంగుతో వుండే ఆకుకూరలతో పాటు పప్పు ధాన్యాలు సెనగలు రాజ్మా ఉలవలు బొబ్బర్లు గోంగూర పుదీనా మెంతికూర సి విటమిన్ కోసం జామ ఉసిరి నిమ్మ బొప్పాయి కమలా ద్రాక్ష వంటివి శరీరానికి కావలిసిన పోషకాలు ఇస్తాయని సప్లిమెంట్ల జోలికి వెళ్ళద్దనీ మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా ఉండమంటున్నారు.
Categories