జుట్టు సిల్క్ లాగా నిగనిగలాడుతూ ఉండాలంటే ఖరీదైన హెయిర్ షాంపులు, మాస్క్ లు కంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే చాలు అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. విటమిన్ ఎ, ఇ,లు ఉండే పదార్ధాలు తినాలి. అలాగే జుట్టులో మృదుత్వం ,సిల్క్ నెస్ ఉండాలంటే సిల్క్ లేదా శాటిన్ కవర్ వేసిన దిండు వాడుకోమంటున్నారు. నిద్రించే సమయంలో తల దిండు పైన పదే పదే కదులుతూ ఉంటే కాటన్ కవర్ కు రుద్దుకొని రాలిపోవటం తెగిపోవటం జరుగుతుంది. అలాగే కాటన్ దిండు కవర్లు నూనె పీల్చేసి తలకు పొడి గా చేసేస్తాయి. జుట్టు రఫ్ గా అయిపోతుంది.సిల్క్ సాటిన్ దిండ్లు ఈ సమస్యని తగ్గిస్తాయని ఎక్స్ ఫర్ట్స్ చెపుతున్నారు.

Leave a comment