కొన్ని టిప్స్ తెలుసుకుంటే వంటింట్లో అవలీలగా పని చేసుకోవచ్చు. వంటలో ట్రిక్స్ తెలిస్తే అద్భుతమైన వంట వండవచ్చు. పెద్ద వాళ్ళు పూర్వం ఇంటికి పది మంది చుట్టాలు వచ్చినా చిటికెలో వండి పెట్టే వారు. వాళ్ళకి ఎంతో అనుభవం తో సులువుగా ప్రతి పని చక్కబెట్టడం వచ్చు. కీర దోస, బీరకాయ చేక్కుతీయకుండా మధ్యకు విరిస్తే చేదు ఎక్కకుండా ఉంటాయి. మంచి తేనె అయిటే నీళ్ళ లో వేస్తె కరగకుండా అడుగుకు చేరుతుంది. నీళ్ళలో కూరగాయలు విడికిస్తే ముందే ఉప్పేస్తే తొందరగా ఉడకవు. సగం పైగా ఉడికాక ఉప్పు వేయాలి. నీళ్ళలో నానబెడితే వెల్లుల్లి పాయ పొట్టు తేలికగా తీయవచ్చు. కూరల్లో ఉప్పు ఎక్కువైతే కొబ్బరి పొడి, ససగాసాల పొడి వేస్తె ఉప్పు సరిపోతుంది. లేదా నాలుగు కొబ్బరి ముక్కలు వుడికే కూరలో వేస్తె, ఉప్పు పీల్చు కుంటాయి. తర్వాత వాటిని తినేయచ్చు లేదా కొబ్బరితో కూర కు రుచి కుడా వస్తుంది.
Categories