మార్కెట్ లో ఎన్నో రెడీ మెడ్ మిక్స్ మసాలా పొడులు కనిపిస్తాయి . ప్రకటనల్లో ఊరిస్తాయి కూడా . కానీ ఇవి పరిమితంగా వాడుకోకపోతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఈ రెడీమిక్స్ లు ,పొడులు ,కూల్ డ్రింక్స్ లో కొన్ని రసాయనాలు ఉపయోగిస్తారు . ఇవి ఆ పదార్దాలు గడ్డకట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు . తేలికగా ఆహారంలో కలిసిపోయేందుకు కూల్ డ్రింక్స్ లో నురగ రాకుండా ఇలా వివిధ అవసరాల నిమిత్తం వాడతారు . ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడే వాటిని తాయారు చేస్తారు . కనుక మరీ అంత ప్రమాదం ఉండదు కానీ ఈ ప్రిజర్వేటివ్స్ వల్ల వీటిని ఎప్పుడూ వాడుతూ ఉంటె మటుకు సమస్యలు వస్తాయి . ఇంట్లో చిన్నపిల్లలు ,వృద్దులు ఉంటారు కనుక తాజాగా ఇంట్లో తయారు చేసుకొన్న వస్తువులు వాడటం మంచిదంటున్నారు .
Categories