మొదట్లో బయటికి వెళ్ళంటే భయం గానే ఉండేది కానీ ఇంట్లో ఎన్నాళ్ళు. జనం ఆపదలో ఉంటే ఆదుకొని తీరాలి. వలంటీర్లతో పాటు నేను చేతులకు గ్లౌజులు,ముఖానికి మాస్క్ వేసుకొని ఈ లాక్ డౌన్ లో అవసరం అయిన వాళ్లకు భోజనం అందిస్తున్నాం అంటోంది ప్రణీత. ప్రణీత ఫౌండేషన్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చాను. మీడియా కధనాలు విని బాధితులను గుర్తించి,ఓ పదిలక్షల వరకు విరాళాలు సేకరించి అందించాను అలానే ఇప్పుడు ప్రతిరోజు భోజనం ప్యాకెట్లు అందిస్తున్నాం. ప్రణీత సేవ గుణాన్ని అందరు ప్రశంసిస్తున్నారు సినిమాల్లోనే కాదు,నిజ జీవితంలోను అసలైన హీరోయిన్ వే అంటున్నారు అభిమానులు.

Leave a comment