
తెలుగులో సూర్యకాంతంలాగా హిందీలో లలిత పవర్ గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరు తోలి రోజుల్లో ఆమె హీరోయిన్ గానే,గ్లామర్ స్టార్ గానే ఉన్నారు. కానీ ఒక షూటింగ్ లో తోటి నటుడు భగవాన్ కథ పరంగా ఆమెనో చెంప దెబ్బ కొట్టవలసి వచ్చింది. ఆదెబ్బ కాస్త గట్టిగా తగిలి ఆమెకు కంటి పక్షవాతం వచ్చింది.అదీ మంచికే అయినట్లు ఆమె క్యారెక్టర్ యాక్టర్ గా కొనసాగి 70 ఏళ్ల పాటు నటిస్తూనే ఉంది. తన తోటి వయసు వాళ్ళ తల్లి పాత్రల్లో మెప్పించారు ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. ఈ నాటికీ ఆమె తర్వాత కూడా ఆమెతో సమానంగా గయ్యాళి పాత్రలు వేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు అంటారు విమర్శకులు.