ఇన్ఫోమానియా వైన్ వుంటారు స్మార్ట్ ఫోన్ కు అనారోగ్యకరంగా ఎడిక్ట్ ఆయిపోవటం. వయసులో ఉన్న పిల్లలు భార్యా భర్తలు ఎవరికైనా ఇది ప్రాబ్లమ్. ఉదయం అనగా ఉద్యోగాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకోగానే కొద్దిసేపైనా భార్యాభర్తలు కలిసి గడపటం ఇంటి విషయాలు పిలల్ల విషయాలు మాట్లాడుకోవటం అవసరం. ఇద్దరూ  ఇలా అనుకోవాలి. ఆ ఇద్దరిలో ఒకరు ఇంటికి కొచ్చిరాగానే ట్విట్టర్ కు ఫేస్ బుక్ లోనో తల దూర్చితే పక్కన వాళ్ళకి కట్టలు తెంచుకొనే కోపం వస్తుంది. సహజంగా పిలల్లు అంతే ఇంటికి రాగానే అన్నీ నోటికి సిద్ధంగా అందించి తల్లితో కూడా  ఒక్క విషయం మాట్లాడకుండా స్మార్ట్ ఫోన్ లో తలదూరిస్తే ఇంకా మనుషుల మధ్య సంబంధాలు ఎక్కడని. ఇదే ఇన్ఫోమానియా ఇది భారీ సమస్యలకు దారితీస్తుంది. ఏ పనిలో ఉన్నా  ఇతర కార్యక్రమాలు  ఉన్నా ఎవరితోనైనా ముఖ్యమైన సంగతులు మాట్లాడుతున్న ఇక తమకు ఎదో మిస్ అయిపోతున్నామనే భయం పట్టుకుంది. సంబంధ భాంధవ్యాలు సమయం పోగొట్టు కొన్నట్లే. ఇదే మానసిక సమస్యకు దారితీస్తుంది. అలాంటి సమస్యకు తెచ్చే ఫేస్ బుక్ ను ట్విట్టర్ లో పరిమితమైన సమయానికి కుదించేసి మనసుని ఇవతలకు లాక్కోగలిగితే సమస్య ఏముందీ. జీవితం మన మాట వినాలి. మనసు మన కంట్రోల్  లో వుండాలి.

Leave a comment