Categories
జిమ్ కి వెళ్తుంటే మాట్స్,టవల్స్ తో పాటు ఇంకొన్ని వస్తువులు ఉండాలి. హార్ట్ బీట్ మానిటర్,పళ్ళీలు,ఎనర్జీ చాక్లేట్స్,టిస్యు పేపర్ లు తప్పని సరిగా ఉండాలి.వేగంగా వ్యాయమం చేస్తుంటే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దాని వేగం తెలుసుకునేందుకు హార్ట్ బీట్ మానిటర్ ఉండాలి. ఫోన్ లో ఈ అప్ప్ డౌన్లోడ్ చేసుకోని దీనిని స్మార్ట్ వాచ్ కి అనుసంధానం చేసుకోవాలి. అలాగే వేగంగా చేసే వ్యాయామంలో శక్తి పోతుంది. బాగ్ లో పళ్ళీలు,ఎనర్జి డ్రింక్స్ ఉంటే తక్షణ శక్తి శరీరానికి అందుతుంది. అలాగే చెమట తుడుచుకునేందుకు టిస్యు పేపర్స్ వైప్స్ వంటీవి అందుబాటులో ఉంచుకోవాలి.ఎంతో మంది వర్కౌట్స్ చేస్తారు కనుక సూక్ష్మజీవులు ఎక్కువే కనుక పర్సనల్ శుభ్రత పైన శ్రద్ద పెట్టాలి.