ఉల్లి కాడలు రుచే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి . విటమిన్లు,పీచు,ఖనిజాలు, ప్రోటీన్లు, అమినో యాసిడ్లు పుష్కలంగా ఉండే ఈ కాడలను ఆహారంలో కలిసి తీసుకొంటే చెక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి. వాటిలోని సల్ఫర్ ఎనలేని శక్తిని ఇస్తుంది. ఉల్లి కాడల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను నాశనం చేయటంలో సమర్ధ వంతంగా పనిచేస్తాయి. ఉల్లి కాడల్లో ఉండే విటమిన్-ఎ.సి వల్ల  శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోంది.జలుబు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతోంది. ఇందులోని విటమిన్-కె ఎముకలను బలంగా ఉంచుతోంది. యాంటీ బాక్టీరియాల్ గుణాలున్న ఈ ఉల్లి కాడలు ఆజీర్తి  ఉదర సంబంధమైన వ్యాధులు రానివ్వదు.

Leave a comment