డాక్టర్ కార్ల వాడ మహాలక్ష్మి ఫోరెన్సిక్ రంగంలో పని చేశారు కర్ణాటకలోని హుబ్లీలో జన్మించిన మహాలక్ష్మి .మాస్టర్స్ లో ఫోరెన్సిక్ కోర్స్ ఎంచుకున్నారు. హత్యలు ఆత్మహత్యలకు గురైన వారి మృతదేహాలకు పోస్ట్ మార్టం చేసారు.కిమ్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు వేలకు పైగా మెడికో లీగల్ కేసులు పరిశీలించారు. ప్రముఖ రచయిత ఎమ్మెన్ కాల్ బుర్గీ హత్య మాజీ ఎంపీ యోగేష్ గౌడ్ హత్య కేసులోనూ ఫోరెన్సిక్ నివేదికలు అందించారు.రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నుంచి ఎండి స్వర్ణ పతకాన్ని సాధించారు మహిళ ఏ రంగంలో నైనా రాణిస్తారని చెప్పేందుకు మహాలక్ష్మి మంచి ఉదాహరణ.

Leave a comment