Categories
ఎప్పుడు చేతులతో ఏదో ఒక పని చేస్తునే ఉంటాం. రసాయనాలు ఇతర డిటర్జెంట్స్ ,పదార్ధాలు అన్నీ చేతులతో తాకుతూ పని చేయాలి. గోళ్ళు మొత్తబడి విరిగిపోకుండా చేతులు మొరటు దేలకుండా ఇంట్లో కొన్నీ జాగ్రత్తలు తీసుకోవచ్చు. గోరు వెచ్చని నీళ్ళు ఒక బౌల్ లోకి తీసుకోని చేతులు అందులో ముంచి మృదువుగా రుద్దితే మృత కణాలు పోతాయి. పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్ రాస్తే చేతులు మృదువుగా ఉంటాయి. గోళ్ళు నీట్ గా కట్ చేసుకోవాలి. వేలి కుదుళ్ళు మరిచి పోకూడదు. వీటిని మృదువుగా ఉంటే ఏదైన క్రీమ్ ఎంచుకొని అప్లైయ్ చేసి మసాజ్ చేస్తే గోళ్ళు ,వేలి కుదుళ్ళు చక్కగా ఉంటాయి. నెయిల్ కలర్ వేసుకొంటే గోళ్ళు పాడవకుండా ఉంటాయి.