ఒకప్పుడు ఈ గ్రామంలో ఉండే ఇప్పపూలతో బతుకు తెరువు కోసం సారాయి కాచేవాళ్ళు మహిళలు . ఇళ్ళల్లో తయారయ్యే మద్యం తాగి భార్యలను కొట్టే భర్తలు ప్రతి ఇంటా దర్శనం ఇచ్చేవాళ్ళు అయితే తోరంగ్ అనే సంస్థ ఈ గ్రామంలో మహిళలకు ఇప్పపూలతో సారాయి కాకుండా లడ్డులు ఎలా తాయారు చేయాలో నేర్చింది . ఇప్పపూలతో ఎన్నో పోషకాలున్నాయి . నెమ్మదిగా గ్రామం మహిళలు ఈ ఇప్పపూలు సేకరించి శుభ్రంచేసి ,లడ్డు లు తయారు చేయటం మొదలు పెట్టాలి . ఈ లడ్డులకు జార్ఖండ్ లోనే కాదు పొరుగు రాష్ట్రాల్లోనూ ఎంతో డిమాండ్ ఉంది . ఈ లడ్డుల్లో ఉండే ప్రోటీన్లు ,విటమిన్లు ,ఇనుము ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి ఇప్పపూల సారా కాకుండా ,ఈ లడ్డు తయారీ మహిళల జీవితం లో ఎంతో తియ్యదనాన్ని తెచ్చింది

Leave a comment