ఖాదీ జాతీయ చేనేత వస్త్రం. ఉతికే కొద్దీ ఇంకా మెత్తగా సౌకర్యంగా వుండటం దీని స్పెషాలిటీ. ఇప్పుడు ఖద్దరు దుస్తుల్ని ప్రోత్సహిస్తూ, నాగార్జునా, సామంత లాంటి వాళ్ళు రావడంలో ఖదీ కాస్త ఫ్యాషన్ డ్రెస్ అయ్యికూర్చుంది. స్వదేశంతో పోల్చుకుంటే విదేశాల్లోనే దీనికి ఎక్కువ గిరాకీ వుంది. కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు ఖాదీని ప్రోత్సహించేందుకు నడుం కట్టాయి. కోట్లాది మందికి ఉపాధి కల్పించే ఖదీ అంటే ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్నారు. ఖాదీ కొత్త అందాల్ని అద్దుకుని ఫ్యాషన్ వేదికల పైన స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది. చీరలు, పంచలు, కుర్తిలే కాక లేహంగాలు, అనార్కలీలు గౌన్లు, ప్యాంట్లు టాప్ లు, కాప్రీలు కుడా ఖదీలో డిజైన్ చేస్తున్నారు. ఇది ఖాదీ చీరల సంగతి చెప్పనక్కరలేదు. చేత్తోనే బడికి నేసే ఊలు, సిల్క్ దారాలను కుడా ఖాదీకు కలిపి నేసే ఖద్దర్ సిల్క్ చీరలు ఒక్కసారి ధరిస్తే ఇంకొ వెరైటీ వద్దు అంటారు.
Categories