Categories

అనగనగా ఒక రాజు గారి కథ యుగాల తరబడి అమ్మ చెపుతోంటే పిల్లలు విన్నారు. అలా కథలు చెపితేనే పిల్లలో తెలివితేటలు పెరుగుతాయని ఇటీవలే పరిశోధనలు చెపుతున్నాయి. కొన్ని వేల మంది తల్లిపిల్లలపై సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు . అధ్యయనం ప్రారంభంలో పిల్లల వయసు రెండేళ్ళు . కొన్నేళ్ళ తర్వాత పిల్లల్లో ఐక్యూ శాతం విపరీతంగా పెరిగిందట. పిల్లల్లో సృజనాత్మకత కనిసిస్తోంది. వాళ్ళు కథలు ఊహించేందుకు, రాసేందుకు ప్రయత్నం చేస్తున్నారని పరిశోధన చెపుతుంది. రోజుకో కథ చెబితే ప్రతి రోజు ఒక కల్పితగాధని పిల్లల మనసులో ఊహించుకొంటూ ప్రశ్నలు వేస్తు విన్నారు కనుక వాళ్ళలో ప్రశ్నించే తత్వం ,లాజిక్ , ఎక్కువ పదాలు ,ఇవన్నీ వృద్ధిలోకి రావటం పరిశోధకులు గమనించారు.