Categories
వేసవిలో పాలు త్వరగా విరిగి పోతూ ఉంటాయి అలా విరిగిపోకుండా ఉండాలి అంటే పాలను బాగా కాచాలి.వాటిని బాగా చల్లారాక ఫ్రిజ్ లో పెట్టుకోవాలి కాచిన పాలను ఎండ తగిలే చోట పెట్టద్దు ఇలా చేస్తే పోషకాలు పోతాయి. కాచిన గిన్నెలోనే పాలను ఉంచాలి.గిన్నెలు మార్చరాదు. కావలసిన పాలను వేరే గిన్నెలోకి తీసుకుని వాడుకోవాలి కానీ పదే పదే మొత్తం పాలు వేడి చేయవద్దు.పాలను అడుగు మందంగా ఉన్న గిన్నెలో సన్నని మంటపై వేడి చేయాలి పాల గిన్నె ఫ్రిజ్ లోని అరల్లో పెట్టాలి కానీ డోర్ ర్యాక్ లో పెట్టరాదు. మిగిలిన పాలను కొత్త పాలతో కలపకూడదు.