ఎప్పుడు ఒకే రకంగా విసుగు తెచ్చే రోటిన్ లో ఉంటాం. నిద్ర లేచిన దగ్గర నుంచి పది గంటలకు ఆఫీస్ కు పోవడం వరకూ కొన్ని రోటిన్ పనులు ఆ తర్వాత ఆఫీస్ లో ఒకే లాంటి చాకిరీ, ఆ పనిలో వచ్చే విసుగు ఒత్తిడి హార్మోన్ల స్థాయి పెరగడం బిపి పెరగడం గుండె కొట్టుకునే వేగం పెరగడం ఇక నెమ్మదిగా అనారోగ్యాలు ఇదీ వరస. ఇప్పుడూ కొన్ని అద్యాయనాలు వత్తిడి తగ్గించే శక్తి మనకు ఇష్టమైన హాబీలో మునిగిపోతే దొరుకుతుంది అంటున్నారు. మనకు పాటలు ఇష్టమైతే నేర్చుకుంటూ పాడుకుంటూ బొమ్మలు వేయడం ప్రాక్టీస్ చేస్తూ ఎదో ఒక హాబీ అలవర్చుకుంటే మనకు సమయం ఎలా గడుస్తుందో తెలియదు ఎంతో రిలాక్సైపోతారు అంటారు  సైకాలజిస్టులు,అద్యాయనకారులు. మనసు రిచార్జ్ అయ్యేందుకు హాబీలు విశ్రాంతి వంటివే అంటున్నారు.

Leave a comment