గర్భిణీ గా ఉండగా శిశువు ఆరోగ్యం కోసం మంచి పోషకాహారం తీసుకోవాలని డాక్టర్లు చెబుతూ ఉంటారు.కానీ ఆహారంతోపాటు తాజా గాలి అవసరం అంటున్నాయి అధ్యయనాలు. కాలుష్యం నిండిన గాలి వల్ల ఒక్క ఆసియాలోనే ఏటా నాలుగు లక్షలమంది గర్భస్థ శిశువులు అమ్మ కడుపులోనే తుదిశ్వాస విడుస్తూన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. మన దేశం సహా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లలోని మహిళలు కాలుష్యం కారణంగా అత్యధిక స్థాయిలో గర్భస్రావాలకు గురవుతున్నారని లాన్సెట్ కథనాలు చెబుతున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం గాలిలో ఉండవలసిన సగటు పీ.ఎమ్ కన్నా మన దేశంలో కాలుష్య స్థాయిలు అధికంగా ఉన్నాయి దాని ఫలితంగానే గడిచిన పదేళ్లకాలంలో గర్భస్రావాల సంఖ్య పెరుగుతూ వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Leave a comment