నీహారికా,

ఒక మంచి విషయం సదాలోచన, క్షమాగుణం అన్నవి కేవలం మనిషికే సొంతం. ఇలాంటి వారికే మానవ సంబందాలు అండగా ఉంటాయి. ఇలాంటి వ్యక్తులకే విజయం లభిస్తుంది. మెదడు లోని అనవసర విషయాలు తొలగిస్తూ వర్తమానం లో జీవిస్తారు. ఇది మానవ సంభందాలు కొనసాగింపుకు గుర్తు. కొంత మంది చూడు వాళ్ళ సంగతి పట్టించుకుంటారు. రోడ్డు పైన పోతు కుడా పక్కవాడూ ప్రణాపాయం లో వున్నా మనకెందుకులే అని దాటి పోతారు. మనం మనుష్యులం అన్న స్పృహ ప్రదర్శంఛారు. ఇది విజయాన్ని పరిమితం చేస్తుంది. ఇతరుల కష్టం మనం కష్టం అనుకునే నైతికట వుండాలి. చెట్టు మనకి స్ఫూర్తి నీడ నిస్తుంది, ఆశ్రయం ఇస్తుంది, కాయలు పండ్లు, పూలు సర్వం తాను ఇవ్వగలిగింది . ఒక వేళ కులిపొతే ఫర్నీచర్ గా, ఏ అలయానికో గడపగా లేదా శవపేటికగా అయినాసమాజానికి ఉపయోగ పడుతుంది. ఆ మాత్రం వివక్షత తో మనిషి సాటి వాళ్ళ కోసం అందులో నూరో వంతయినా చేయగలిగితే మానవత్వపు పరిమళాలు గుబాలిస్తాయి. దీనికి కులం, మతం, జాతి, భాష తో పని లేదు. మనది జగమంత కుటుంబం అనుకోవాలి. ఏమంటావు.

Leave a comment