ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల దుంపల రకాలున్నాయి. వీటిలో పుష్కలంగా కార్బోహైడ్రేడ్స్ తో బంగాళదుంప గొప్ప ఇంధనంగా వుండే ఆహారం అంటారు. ఉడికించే ప్రక్రియలో కష్ట శ్రద్ధ తీసుకుంటే అదనపు కొవ్వుకు దూరంగా ఉండచ్చు. వీటిలో రెడ్ పోటాటో కొంచెం తీయగా ఉంటాయి. చక్కెర శాతం ఎక్కువగా స్టార్ట్ శాతం తక్కువగా వుంటుంది. పైతోలు గట్టిగా పట్టీ వుంటుంది కూరలు సలాడ్స్ చేసేందుకు అనువుగా వుంటాయి. పీచు తక్కువగా వుంటుంది. కంటికి ఇంపుగా కనిపించే ఈ ఎర్ర పోటాటో లో కాన్సర్ తో పోరాడ గల  ఫిటో న్యూట్రియంట్స్  ఎక్కువగా వున్నాయి. ఐరన్, జింక్, పోటాషియం, మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్  మొదలైనవి లాభిస్తాయి. బంగాళదుంపల్లో ఇంకా రాస్సెట్ వైట్, పర్సుల్ మొదలైన ఎన్నో రకాలున్నాయి.

Leave a comment