జల్సా సినిమా ఒక నేరం చేసిన స్త్రీ కి, ఆ నేరం వల్ల నష్టపోయిన స్త్రీకి మధ్య నడిచే కథ జర్నలిస్ట్ విద్యాబాలన్ విడాకులు తీసుకున్న మహిళా సెరిబ్రల్ పాల్సీ ఉన్న ఒక పన్నెండేళ్ళ అబ్బాయి ఉంటాడు. వాళ్ళ ఇంట్లో వంట మనిషి షెఫాలీ షా ఒకరోజు రాత్రి విద్యాబాలన్ వేగంగా కారు నడుపుతూ హఠాత్తుగా అడ్డం వచ్చిన అమ్మాయిని ఢీ కొడుతుంది అక్కడ ఎవరూ ఉండరు ఆ టీనేజ్ అమ్మాయిని అలా రోడ్డు మీద వదిలేసి ఇంటికి వస్తుంది. తీరా ఉదయం చూస్తే ఆ గాయపడిన అమ్మాయి వంట మనిషి కూతురు ఆ ఇంటికి ఎంతో కావలసిన మనిషి. పిల్లవాడిని ఎంతో ప్రేమించే వ్యక్తి గాయపడిన పిల్లకు వైద్యం చేయిస్తుంది. కానీ మనసులో గిల్టీ ఫీలింగ్ పోలీసులు మధ్యవర్తులుగా షెఫాలీ కి డబ్బులు ఇప్పిస్తారు కానీ ఆ క్రమంలో ఆమెకు తన యజమానే తన పిల్లకు యాక్సిడెంట్ చేసింది అని తెలిసి పోతుంది. ఈ ఇద్దరు స్త్రీలు ఏం నిర్ణయించుకొన్నారు? మాట, కదలిక లోపం ఉన్న పిల్లవాడిని సమానంగా ప్రేమించే ఈ ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు? స్త్రీల ప్రపంచంలో పురుషుల్లో లాగా నేరం, తర్వాత శిక్షేనా? ఈ సినిమా తప్పకుండా చూడవలసిన మంచి సినిమా. అమెజాన్ ప్రైమ్ లో ఉంది.

Leave a comment