జమున తుడు స్వస్థలం ఒడిస్సాలోని రాయరంగాపుర్. తండ్రి వ్యవసాయదారుడు జార్ఖండ్ కి చెందిన మాన్ సింగ్ తో ఆమె వివాహం జరిగింది. అయన గుత్తేదారి పని చేసేవాడు. దుర్గంలోని అడవిని చుసింది జమున. దాన్ని పుర్తిగా ద్వంసం చేసారు. యాబై హెక్టార్ల విస్తిర్ణంలోని అడవి టేకు చెట్లకు ప్రసిద్ది. ఆ అడవిని రక్షించేందుకు పునుకుంది జమున తుండు.మహిళా సైన్యాన్ని నిర్మించింది. అడవి ద్వంసం చేసే వారిపై కేసులు పెట్టింది.300 గ్రామాలు వన్యసంరక్షణ సమితులుగా పని చేస్తున్నయి. దాదాపు పది వేల మంది సభ్యులు ఉన్నారు. పచ్చదనం కోసం ప్రాణాలను తెగించి మాఫియా బారి నుండి అడవిని రక్షించేందుకు పునుకుంది జమున తుడుని పద్మా శ్రీ వరించింది.