-డి.సుజాతాదేవి సరదాలా వరదమావయ్యె సందేళ కానీయరొ సందమావ సాటుగుండి తొంగి తొంగి సూత్తాడు సుక్కలన్ని నన్ను సూసి ఎక్కిరించిపోతాయి !! సందకాడ జాజీ పూలు సొగసు లార బోత్తాయి ఊసుపోని గాలి బావ ఊరంత పంచుతాడు !! ఎన్నెలోడు సొ రగానికి ఎండిపూల దారేత్తడు నీలి మబ్బు నీడలోన గూడుకట్టి ఉండాల !!